
మహిళల భద్రతకు చట్టాలు తీసుకురావాలి
కాగజ్‌నగర్‌టౌన్: మహిళల భద్రతకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సీఐటీయూ జాతీ య కోశాధికారి ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. పట్టణంలోని వినయ్‌గార్డెన్‌లో తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ సదస్సు రెండోరోజు సోమవారం కొనసాగింది. ఆయన మాట్లాడుతూ దేశంలోని 50 కోట్ల మంది కార్మికుల పని, సామాజిక భద్రత, సంక్షేమ చర్యలు అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో ఆశ వర్కర్‌పై దాడి ఘటన విషయంలో స్పందన లేదని మండిపడ్డారు. లైంగిక వేధింపుల చట్టం– 2013ను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. నవంబర్ 1, 2 తేదీ ల్లో హైదరాబాద్‌లో అఖిల భారత శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు త్రివేణి, రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, పద్మశ్రీ, భోపాల్, కోశాధికారి వంగూరి రాములు, నాయకులు రమ, రాజేందర్, శ్రీనివాస్, కూశన రాజన్న, దినకర్, ఆనంద్‌కుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.