
జోనల్‌స్థాయి పోటీలకు బాక్సర్ల ఎంపిక
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని సర్‌సిల్క్ కాలనీలో సోమవారం సబ్ జూనియర్ బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపినవారిని జోనల్‌స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేశారు. అండర్– 17 బా లుర విభాగంలో సీహెచ్ బాబ్జి, ఫరాన్‌ఖాన్, సాయిగౌడ్, షేక్ అబ్దుల్ ఇలియాన్, అండర్– 17 బాలికల విభాగంలో టి.సంజన ఎంపికయ్యారు. ఈ నెల 8న నిర్మల్‌లో నిర్వహించే జోనల్‌స్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మధు, కార్యదర్శి శేఖర్, చైర్మన్ శివనాయర్, కోశాధికారి రమాకాంత్, యాదవ్ పాల్గొన్నారు.