
రెండు నెలలుగా దాహం కేకలు
లింగాపూర్: మండలంలోని పలు గ్రామాల్లో తాగునీరు సరఫరా కావడం లేదు. మండల కేంద్రంతోపాటు కీమానాయక్ తండా, పిక్లాతండా, మోతీగూడ గ్రామాలకు రెండు నెలలుగా భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని పంచాయతీ బోరుకు నాలుగు నెలలుగా మరమ్మతు కూడా చేయించడం లేదు. ఇక మండల కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలో 50 కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో సమీపంలో ఉన్న ఒకేబోరుపై ఆధారపడుతున్నారు. పిల్లలకు కనీసం స్నానాలు చేయించేందుకు నీళ్లు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.