
కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుదాం
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్య తిరేక విధానాలను ఎండగడుదామని సీఐటీ యూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. పట్టణంలో ఆదివారం తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమి టీ రాష్ట్ర ఐదో సదస్సు నిర్వహించారు. బాలభారతి స్కూల్ నుంచి వినయ్‌గార్డెన్ వరకు గుస్సాడీ, ఒగ్గు డోలు, ఆదివాసీ కళాకారులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం వినయ్ గార్డెన్‌లో సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు ఆర్.త్రివేణి అధ్యక్షత బహిరంగ సభ నిర్వహించారు. సాయిబాబు మాట్లాడుతూ బీడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అంగన్‌వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజన, మెడికల్ అండ్ హెల్త్ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలకు కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ప్రసూతి సెలవులు, ఈఎస్‌ఐ, పీఎఫ్, పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు భాస్కర్, రమ, భూపాల్, వెంకటేశ్, జయలక్ష్మి, పద్మ శ్రీ, శ్రీనివాస్, రాజేందర్, కూశన రాజన్న, దుర్గం దినకర్, కార్తీక్, టీకానంద్, ఆనంద్, ఆర్.మహేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.