
ఇప్పటికీ చుక్క రాలే..
ఆసిఫాబాద్‌అర్బన్/ఆసిఫాబాద్‌రూరల్: రూ.కోట్లు వెచ్చించి ఆసిఫాబాద్ పట్టణంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చినా పలు ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్నాయి. ఐదు రోజులుగా పలు కాలనీలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పట్టణంలోని రాజంపేట కాలనీలోని ఇళ్లకు ఇప్పటివరకు చుక్క నీరు సరఫరా కాలేదు. ఆసిఫాబాద్ మండలం మోతుగూడలో 570 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఇప్పటికీ నల్లాలు బిగించలేదు. ప్రజలు బావి నీళ్లే తాగుతున్నారు. వర్షాకాలంలో నీరు కలుషితమైతే డబ్బులు పెట్టి మినరల్ వాటల్ కొనుక్కుంటున్నారు.