
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కాగజ్‌నగర్‌టౌన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్‌లో ఆదివారం పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతి థిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 317 జీవో రద్దుకు పోరాడుతామన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన జీపీఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సునార్కర్ అనిల్, జిల్లా గౌరవ అధ్యక్షుడు నరసింహచారి, నాయకులు రాకేష్, శ్రవణ్, గంగాభవానీ, ప్రకాశ్, హన్మంతు, అనురాధాబాయి, వేణుగోపాల్, ఇందారపు ప్రకాశ్, భిక్షపతి, దేవాజీ పాల్గొన్నారు.