
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే హరీశ్‌బాబు అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ఆధ్వర్యంలో రెబ్బెన మండలానికి చెంది న బీఆర్‌ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చే యాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా బొడ్డు మౌనిక, నానవేణి మల్లేశ్, బొడ్డు రాజ్‌కుమార్, గంగాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇగురపురమేశ్ బీజేపీలో చేరా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నపూర్ణ, నాయకులు సుదర్శన్‌గౌడ్, ఎలమంచిలి సునీల్ చౌదరి, కుందారపు బాలకృష్ణ, సొల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.