
పరిశుభ్రతకు సమయం కేటాయించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రతిఒక్కరూ రోజులో కొంత సమయం పరిసరాల పరిశుభ్రతకు కేటాయించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో గురువారం స్పెషల్ క్యాంపెయిన్ 5.0ను ప్రారంభించారు. జీఎం మాట్లాడుతూ స్పెషల్ క్యాంపెయిన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, సమాజంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజలు సమయం కేటాయిస్తే పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరిగూర పీవో మచ్చగిరి నరేందర్, ఏజీఎం కృష్ణమూర్తి, డీజీఎంలు ఉజ్వల్‌కుమార్, మదీనాబాషా, సీహెచ్‌పీ ఎస్‌ఈ కోటయ్య, ఏఎస్‌వో శ్రీధర్, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్, అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.