
కలెక్టర్‌ను కలిసిన ట్రెయినీ అధికారి
ఖమ్మంమయూరిసెంటర్:ఇటీవల ప్రకటించిన గ్రూప్ –1 ఫలితాల్లో బీసీసంక్షేమ అధికారిగా ఎంపికై న సాయి శ్రీజను రాజన్న సిరిసిల్ల జిల్లాలో నియమించారు. ఆపై ఆమెను శిక్షణ నిమిత్తం ఖమ్మం జిల్లాకు కేటాయించడంతో ఇక్కడకు వచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి.జ్యోతి పాల్గొన్నారు.
ట్రెక్కింగ్ పోటీల్లో ప్రతిభ
మణుగూరుటౌన్: ఆల్ ఇండియా ట్రెక్కింగ్ పోటీల్లో మణుగూరు సింగరేణి విద్యార్థులు ప్రతిభ చూపా రు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు హెచ్‌ఎం కల్యాణి ఎన్‌సీసీ ధ్రువపత్రాలను అందజేసి మాట్లాడారు. గత నెల 25 నుంచి ఈనెల 2వరకు తిరుపతిలో ఎన్‌సీసీ 8వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 102 మంది పాల్గొన్నారని చెప్పారు. ఇందులో మణుగూరు సింగరేణి హైస్కూల్ నుంచి 8మంది ప్రతిభ చూపారన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల కోచ్, ఏఎన్‌ఓ కె.రాజసింహ, ఉపాధ్యాయుడు మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.