
‘వసతి’కి తాళం..
ఉమ్మడి జిల్లాలో
వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాల
సమస్యను పరిష్కరించాలి..
వసతిగృహాల్లో వంట చేయించాలి..
దసరా సెలవులు ముగిసినా
అదే పరిస్థితి
కార్మికుల సమ్మెతో గిరిజన
సంక్షేమ వసతిగృహాల్లో ఇక్కట్లు
ఆశ్రమ పాఠశాలలకూ
నామమాత్రంగానే విద్యార్థులు
ఖమ్మంమయూరిసెంటర్: వేతనాల సమస్యపై కొద్ది వారాలుగా కార్మికులు చేస్తున్న సమ్మెతో గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో వంటగదులు తెరుచుకోలేదు. దసరా సెలవుల కన్నా ముందే కార్మికులు సమ్మెలోకి దిగడంతో విద్యార్థులకు ఆహారం అందించడం సమస్యగా మారింది. సెలవులు ముగిసేలోగా పరిస్థితులు చక్కబడతా యని భావించినా ఆ పరిస్థితి లేక జిల్లాలోని పలు గిరిజన సంక్షేమ వసతిగృహాలు తెరుచుకోలేదు. ఈ విషయం తెలిసి ఆశ్రమ పాఠశాలలకు విద్యార్థులు కూడా అంతంతమాత్రంగానే వచ్చారు. వేతనాల తగ్గింపు జీఓను రద్దు చేయాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగిన కార్మికులు సమస్య పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని చెబుతున్నారు. ఈ ప్రభావం విద్యార్థులపై పడుతుండగా.. అధికారులు కూడా సమస్య ప్రభుత్వం, కమిషనర్ స్థాయిలో ఉన్నందున తామేమీ చేయలేమని చెబుతుండడం గమనార్హం.
రెండు రోజులైనా అదే పరిస్థితి..
కార్మికుల సమ్మె కాలంలో దసరా సెలవులు రావడంతో అటు గిరిజన శాఖ అధికారులు, ఇటు వసతిగృహ సంక్షేమ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, సెలవులు ముగిసినా సమ్మె విరమింపజేయకపోవడంతో గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో పొయ్యిలు వెలగడం లేదు. ప్రీమెట్రిక్ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు ఈ నెల 4వ తేదీ శనివారం నుంచే తెరుచుకోవాల్సి ఉండగా సోమవా రం నుంచి రావాలని విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. కొన్ని ఆశ్రమ పాఠశాలలు, ప్రీ మెట్రిక్ వసతి గృహాల అధికారులు మాత్రం తాము చెప్పేవరకు రావొద్దని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇక పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాలకు సంబంధించి కొన్ని వసతిగృహాలను మూసి ఉంచారు. ఖమ్మంలో ఏడు వసతిగృహాలు ఉండగా రెండు, మూడే తెరిచినట్లు తెలుస్తోంది.
బయటే టిఫిన్, భోజనం
రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్, డెయిలీ వేజ్ కార్మికుల సమ్మెతో వసతిగృహాల్లో పనులు నిలిచిపోయాయి. చాలా వసతిగృహాల్లో ఇద్దరు,ముగ్గురు డెయిలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మి కులే ఉన్నారు. దీంతో చాలా వాటిని మూసి ఉంచ గా, కొన్నింటిని తెరిచినా వంట చేయడం లేదని తెలుస్తోంది. ఖమ్మం రేవతిసెంటర్‌లోని ఏటీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న గిరిజన సంక్షేమశాఖ ఖమ్మం రూరల్ కళాశాల బాలుర వసతిగృహంలో వంట గదితాళం తెరుచుకోలేదు. దీంతో వచ్చిన విద్యార్థులు టిఫిన్, భోజనం బయటే చేస్తున్నారు. ఏటీడీఓ కార్యాలయ ఆవరణలోని వసతిగృహం ఇలా ఉంటే మిగతా వాటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
విద్యార్థులపై ప్రభావం
కార్మికుల సమ్మె ప్రభావం విద్యార్థులపై పడుతోంది. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమైనా వసతిగృహాలు తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మారుమూల గ్రామాలకు చెందిన వారు ఖమ్మం కళాశాలల్లో చదువుతుండగా వీరికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. కార్మికుల సమ్మెతో భోజనం సిద్ధం చేయించే పరిస్థితి లేక ఆశ్రమ పాఠశాలలకు రావొద్దని సమాచారం ఇచ్చినా త్వరలో జరగనున్న సమ్మెటివ్ పరీక్షల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇకనైనా ప్రభుత్వం కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
హాస్టల్ ఖమ్మం భద్రాద్రి
పోస్ట్ మెట్రిక్ వసతిగృహాలు 12 22
ప్రీ మెట్రిక్ వసతిగృహాలు 08 17
ఆశ్రమ పాఠశాలలు 10 86
కార్మికుల సమస్యను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలి. కార్మికులు లేరనే సాకుతో కొన్ని వసతిగృహాలను తెరవకపోవడం సరికాదు. సెలవులు ముగియగానే వసతిగృహాలను తెరిపించాల్సిన అధికారులు పట్టింపులేనట్లు వ్యవహరించడం గర్హనీయం. –ఇటికాల రామకృష్ణ,
ఏఐఎస్‌ఎఫ్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి
వసతిగృహాలకు వస్తున్న విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. కార్మికులు లేరని వంట గదులు కూడా తెరవలేదు. అధికారులు వెంటనే కార్మికులను ఏర్పాటుచేసి విద్యార్థులకు భోజనం అందేలా చూడాలి. జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
–వి.వెంకటేశ్, పీడీఎస్‌యూ,
ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి
తెరుచుకోని హాస్టళ్లు.. వెలగని పొయ్యి

‘వసతి’కి తాళం..

‘వసతి’కి తాళం..

‘వసతి’కి తాళం..