
ఆర్చరీ, కబడ్డీ, రెజ్లింగ్ జట్ల ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా సంఘం ఆధ్వర్యాన వివిధ క్రీడల ఉమ్మడి జిల్లా స్థాయి జట్ల ఎంపికకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం పోటీలు నిర్వహించా రు. కబడ్డీ జట్ల ఎంపికకు 110 మంది బాలబాలి కలు, ఆర్చరీ జట్ల ఎంపికకు 20 మంది, రెజ్లింగ్ ఎంపికకు 25 మంది హాజరయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న జట్ల ఎంపిక పోటీలను కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్‌బాబు, ఖేలో ఇండియా ఖమ్మం సెంటర్ కోచ్ నగేశ్, క్రీడా సంఘం కార్యదర్శి ఎండీ మూసీకలీం పర్యవేక్షించారు.
●జిల్లా బాలుర కబడ్డీ జట్టులో బి.కౌశిక్, జి.వినయ్, పి.మనోహర్, వి.సాయికిరణ్, ఐ.కుమార్, ఆర్.రాకేశ్, జి.గణేశ్, కె.భార్గవ్‌రెడ్డి, ఈ.అజయ్‌కుమార్, బి.మధు, డి.సాయికిరణ్, సాయికృష్ణ, వి.వివేక్, ఎల్.అరవింద్, బి.శరత్, డి.ధనుష్, డి.ఆనంద్‌కిశోర్ స్థానం దక్కించుకున్నారు.
●బాలికల కబడ్డీ జట్టుకు జి.మైశ్రీ, బి.కుసుమ, బి.పల్లవి, ఎస్‌కే వాదాహసీనా, ఎన్.పల్లవి, జి. సాహితి, జి.హరిణి, టి.వినీల, ఎస్.భావ్యశ్రీ, కె.ప్రత్యూష, ఎస్‌కే రిజ్వాన, ఆర్.శ్రీలత, జి.యశస్విని, స్నేహ, కె.ఇందు, ఎండీ ఆసియా, ఎల్.మిత్ర, కె.సోమక్క ఎంపికయ్యారు.
●జిల్లా ఆర్చరీ బాలుర జట్టులో ముల్కి చరణ్, ఆర్.బార్గవ్, బి.హరికృష్ణ, ఎ.కొండల్‌రాయ్, బాలికల జట్టులో టి.వీరభద్రమ్మ, కుంజ భవ్యకు స్థానం దక్కింది.
●రెజ్లింగ్ బాలుర జట్టులో ఎ.విష్ణువర్దన్, జి.యువరాజ్, ఎన్.వివేక్‌వర్దన్, బి.మణిచరణ్, పి.శివతేజ్‌నందన్, పి.జయదేవ్, పి.గణేశ్, వి.ఉదయ్‌కిరణ్, కె.లిఖిత్ చరణ్, ఎం.అమేశ్ బహూదుర్, ఎస్.చరణ్‌రాజ్, బాలికల జట్టులో జి.వర్షిత, కె.దీక్షిత, ఆర్.గీత హర్షిణి స్థానం దక్కించుకున్నారు.
అండర్–19 బాలికల ఫుట్‌బాల్ జట్టు
ఉమ్మడి జిల్లాస్థాయి ఫుట్‌బాల్ బాలికల జట్టు ఎంపిక పోటీలు మంగళవారం ఖమ్మంలోని మున్సిపల్ పార్క్‌లో జరిగాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది క్రీడాకారిణులు పాల్గొనగా, ఎంపిక ప్రక్రియను ఫుట్‌బాల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కె.ఆదర్శ్‌కుమార్, క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డీ.మూపా కలీం పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లా జట్టుకు ఎం.కిరణ్మయి, జి.ఆశా, బి.వైష్ణవి, టి. స్వాతి, ఎం.రూప, బి.కావ్య, కె.సాత్వి, ఎం.సృజన, ఎం.నవ్యశ్రీ, ఎం.నక్షత్ర, ఎం.యువ వర్షిణి, ఎస్.కే.నసీమా, బి.హాసిని, కె.నందిని, బి.ప్రవళిక, కె.తేజశ్రీ, వర్షిత, భావన ఎంపికయ్యారని వెల్లడించారు.