
పైలేరియా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో పైలేరియా వ్యాధి సంపూర్ణ నిర్మూలనకు వైద్య సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సర్వేపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వగా ఆమె మాట్లాడారు. ఫైలేరియా నిర్మూలనలో సర్వే కీలకమైనందున వ్యాధి వ్యాప్తి ఆగిందా, లేదా అనేది నిర్ధారించాలని తెలిపారు. ఆపై సర్వే విధానం, శాంపిళ్ల పరిశీలన, వివరాల నమోదుపై అదనపు డీఎంహెచ్‌ఓ వెంకటరమణ అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందునాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
కామేపల్లి: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి తెలిపారు. కామేపల్లి మండలం మద్దులపల్లిలో భద్రాచలం ఐటీడీఏ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఆమె పరిశీలించి మా ట్లాడారు. గ్రామీణుల చెంతనే వైద్యం అఒందించేలా శిబిరాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ 400 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. భద్రాచలం ఐటీడీఏ అడిషినల్ డీఎంహెచ్‌ఓ సైదులు, వైద్యులు, ఉద్యోగులు నెల్లూరి చందన, శిరీష, ప్రసన్న జ్యోతి, అమీనాజ్, నిరోష, రాజశేఖర్, అభిలాష్ రెడ్డి, జైకీర్తి, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, నరేంద్రనాయక్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ కళావతిబాయి