
వివిధ రంగాల్లో విరివిగా సేవలు
రాయచూరు రూరల్: విశ్వకర్మ సమాజం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందించామని రాష్ట్ర విశ్వకర్మ మండలి అధ్యక్షుడు సుజ్ఞానమూర్తి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో బంగారు ఆభరణాల తయారీ పనులు చేసే 10 మందికి రూ.లక్ష చొప్పున రుణాలు మంజూరు చేశామన్నారు. మండలి నుంచి గంగా కళ్యాణ పథకం ద్వారా బోరు బావుల తవ్వకం, వాహన రుణాల మంజూరు చేపట్టామన్నారు. విశ్వకర్మ సమాజం సభ్యులతో కలిసి ప్రభుత్వాలు మంజూరు చేసే పథకాల గురించి ప్రచారం చేస్తామన్నారు. సమావేశంలో మారుతి, రాము, మనోహర్ పత్తార్, బ్రహ్మ గణేష్, వెంకటేష్‌లున్నారు.
విద్యార్థుల అభివృద్ధికి
సహకారం అవసరం
రాయచూరు రూరల్ : విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం అవసరమని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. సంస్కృతి, సంస్కారాలతో పాటు జీవిత విలువలను వారిలో అలవర్చుకొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో శరణప్ప, దండెప్ప, అస్లాం పాషా, బాబూ రావ్ శేగుణిషి, అబ్దుల్ రజాక్‌లున్నారు.

వివిధ రంగాల్లో విరివిగా సేవలు