
శరన్నవ రాత్రి ఉత్సవాలకు తెర
రాయచూరు రూరల్ : జిల్లాలో మంగళవారం శరన్నవరాత్రి ఉత్సవాలకు తెరదించారు. సుల్తాన్‌పూర్ బృహన్మఠంలో శ్రీదేవి, కోటలోని కాళికా దేవి ఆలయంలో ప్రతిమకు ప్రత్యేకంగా పూజలు జరిపారు. సుల్తాన్‌పూర్ బృహన్మఠంలో శ్రీదేవి పురాణ మంగళం సందర్భంగా చిన్నారులతో నృత్య ప్రదర్శనలు జరిగాయి. కాళికా దేవి ఆలయంలో పున్నమి సందర్భంగా విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రశేఖర్ కపిలవాయి, శివ కుమార్, సభ్యులు సత్యనారాయణ, రవి, బ్రహ్మ, ఈశ్వర్, కేశవమూర్తిలున్నారు.

శరన్నవ రాత్రి ఉత్సవాలకు తెర