
24 గంటలు.. 20 ఆపరేషన్లు
వేములవాడఅర్బన్: వేములవాడ ఏరియా ఆస్పత్రిలో 24 గంటల్లో 20 వివిధ రకాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. సాధారణ కాన్పులు 4, ఆపరేషన్లు 9, కంటి ఆపరేషన్లు 4, జనరల్ సర్జరీలు 2, ఆర్థో ఆఫరేషన్ ఒకటి చేశారు. ఆపరేషన్ చేసిన వైద్యులు సంధ్య, సోని, మాధవి, సుభాషిణి, చారీ, రమణ, అనిల్‌కుమార్, రాజశ్రీ, తిరుపతి, రవీందర్, రత్నమాల, నర్సింగ్ ఆఫీసర్స్ ఝాన్సీ, జ్యోతి, అనసూయతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఎక్స్‌లో కేంద్ర మంత్రి అభినందనలు
వైద్యసేవలు అందించడంలె నిబద్ధతతో పనిచేస్తున్న వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఎక్స్ వేదికగా అభినందించారు. డాక్టర్లు, సిబ్బంది అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్యకు, వైద్యసిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
వైద్యులకు ప్రభుత్వ విప్ ఆది అభినందనలు
వేములవాడ ఏరియా ఆస్పత్రి వైద్యులు 24 గంటల్లో 20 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు. ఆధునిక వైద్యసేవలతోపాటు శుభ్రత, రోగి సేవ ధోరణిలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. వైద్యులు, సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.