
ఆలయ భూముల సమస్య పరిష్కరించాలి
కరీంనగర్ కల్చరల్: దేవాదాయశాఖ భూ సమస్యలు పరిష్కరించాలని, 2014నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఆడిట్ వివరాలు, నివేదికలు పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుప్రియ సూచించారు. కరీంనగర్‌లోని దేవాదాయశాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆలయ భూముల సమస్యలు, సీసీఎల్‌ఎ భూముల రిజిస్ట్రేషన్లు, భూముల డిజిటలైజేషన్, కొత్త ఆలయాల రిజిస్ట్రేషన్లు, బంగారం, వెండి స్వీకరణ, అప్పగింతల నివేదిక ఎప్పటికప్పుడు తనకు అందజేయాలని అన్నారు. ఇన్‌స్పెక్టర్ టూర్ డైరీ గురించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. అధికారులు పారదర్శకంగా భక్తులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.