
ఉద్యోగుల ఐక్యతే అభివృద్ధికి బాట
తిమ్మాపూర్: ఉద్యోగుల ఐక్యతే అభివృద్ధికి దోహదం చేస్తుందని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ మధుసూదన్‌న్ రావు స్పష్టం చేశారు. ఎల్‌ఎండీ కాలనీలోని ఎస్సారెస్పీ అతిథి గృహంలో బుధవారం మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పర్మినెంట్ ప్రమోషన్లు రావడం ఉద్యోగుల్లో ఉత్సాహం నింపిందని పేర్కొన్నారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది దసరా పండుగను ఉద్యోగులు అంత సంతోషంగా జరుపుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చిన్నచూపు కనిపిస్తోందన్నారు. మరో ఈఎన్సీ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు ఇరిగేషన్‌శాఖకు మొదటి బహుమతి రావడం సంతోషకరం అన్నారు. ఎస్‌ఈ సుమతిదేవి, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, మన్నె సరిత, తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షుడు పోలు కిషన్, కార్యదర్శి అంబటి నాగరాజు, కోశాధికారి అశోక్ పాల్గొన్నారు.