
పారిశుధ్యం మెరుగు పర్చాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరవ్యాప్తంగా పారిశుధ్యాన్ని మరింత మెరుగు పర్చాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించా రు. బుధవారం నగరంలోని 34వ డివిజన్ గోదాంగడ్డలో పారిశుధ్య పనులు పరిశీలించారు. జవాన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఆయా డివిజన్లలో కార్మికులతో పారిశుధ్య పనులు చేయించాలని సూచించారు. ఇంటింటికీ స్వచ్ఛ ఆటోలు తప్పనిసరిగా వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. గార్బెజ్ పా యింట్ల వద్ద చెత్త పడవేయకుండా పర్యవేక్షించాలన్నారు. గోదాంగడ్డ హనుమాన్ ఆలయం వద్ద గోడ శిథిలమైనందున, నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.
కరీంనగర్‌రూరల్: బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చే స్తోందని డీఎంహెచ్‌వో వెంకటరమణ అన్నా రు. కరీంనగర్ మండలం చామనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు, రోగుల రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లో అసంక్రమిత వ్యాధుల రికార్డులను పరిశీలించి బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల వివరాల నమోదును తనిఖీ చేశారు. ప్రసూతిగదిలో అత్యవసర మందులను పరిశీలించారు. ప్రసూతి సంఖ్యను పెంచాలని వైద్యులకు సూచించారు. పీవో సనా, పీహెచ్‌సీ మనోహర్ పాల్గొన్నారు.
కరీంనగర్ అర్బన్: కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను బుధవారం డీఆర్‌వో బి.వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్ని కల సంఘం మార్గ నిర్ధేశం ప్రకారం ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలి పారు. గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గదులు, వీవీప్యాట్ గదుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ పార్టీల నేతలు మడుపు మోహన్, సత్తినేని శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, మిల్కూరి వాసుదేవరెడ్డి, బర్కత్ ఆలీ, కల్యాడపు ఆగయ్య, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.
కరీంనగర్ అర్బన్: పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని మార్కెటింగ్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉమ్మడి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. సీసీఐ కొనుగోళ్లలో కపస్ కిసాన్ యాప్, స్లాట్ బుకింగ్ సిస్టమ్, కౌలుదారు రైతు రిజిస్ట్రేషన్ వంటి కీలక అంశా ల గురించి వివరించారు. మార్కెటింగ్ రీజిన ల్ డిప్యూటీ డైరెక్టర్ వి.పద్మావతి, డీఎంవోలు షా బుద్దీన్, ప్రకాశ్, జిల్లా వ్యవసాయ అధికారులు భాగ్యలక్ష్మి, అఫ్జల్ బేగం, అంజని పాల్గొన్నారు.
బల్దియాకు ఆర్‌టీఐ అవార్డు
కరీంనగర్ కార్పొరేషన్: సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు నగరపాలకసంస్థకు రాష్ట్రస్థాయిలో అవార్డు దక్కింది. తెలంగాణ సమాచార కమిషన్ బుధవారం రాష్ట్రస్థాయిలో అవార్డులు ప్రకటించింది. ఉత్తమ ప్రతిభ కనపరిచిన జిల్లా అవార్డు మూడు జిల్లాలకు రాగా, అందులో కరీంనగర్ జిల్లాకు చోటు దక్కింది. అలాగే అసిస్టెంట్ పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ (ఏపీఐఓ)గా ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరపాలకసంస్థ డిప్యూటీ సిటీ ప్లానర్ బషీర్ అవార్డుకు ఎంపికయ్యారు. సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చే దరఖాస్తులను పరిష్కరించడంలో ముందుండడంతో డీసీపీ బషీర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ వారం చివరలో బషీర్ అవార్డును అందుకోనున్నారు.

పారిశుధ్యం మెరుగు పర్చాలి

పారిశుధ్యం మెరుగు పర్చాలి

పారిశుధ్యం మెరుగు పర్చాలి