
విలువలు నేర్పిన మహర్షి
వాతావరణం జిల్లాలో ఆకాశం మేఘావృతమవుతుంది. వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.
రామాయణం రచించిన వాల్మీకి సత్యం, ధర్మం, న్యాయం, సేవా వంటి విలువలను సమాజానికి చాటి చెప్పారని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, డీఆర్‌వో బి.వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాశ్, ఏవో సుధాకర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్ కల్చరల్