
జరిమానా.. సన్మానం
రోడ్డుపై చెత్త పడేసిన వ్యక్తికి మంగళవారం బల్దియా అధికారులు జరిమానా విధించారు. అనంతరం సన్మానించారు. కరీంనగర్ సిటీలోని గీతాభవన్ పక్కవీధిలో రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తిని పారిశుద్ధ్య విభాగం అధికారులు గుర్తించి ముందుగా రూ.500 జరిమానా విధించారు. తర్వాత పూలదండతో సత్కరించి, మరోసారి రోడ్డుపై చెత్త పడవేయరాదని కౌన్సెలింగ్ నిర్వహించారు. కరీంనగర్‌ను గార్బెజ్ ఫ్రీసిటీ (చెత్త రహిత నగరం)గా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు నగరపాలకసంస్థ పర్యావరణ ఇంజినీర్ స్వామి తెలిపారు. సీసీటీవీల ద్వారా పరిశీలించి చెత్త పడవేస్తున్న వారిని గుర్తించి, జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.
– కరీంనగర్ కార్పొరేషన్