
చదువులు ఎట్ల?
చదువులు ఎట్ల? అని బెస్ట్ అవెలబుల్ స్కూల్ విద్యార్థులు, పేరెంట్స్ కదం తొక్కారు. ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు రెండేళ్లుగా స్కూల్ ట్యూషన్, హాస్టల్ ఫీజు చెల్లించకపోవడంతో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ బెస్ట్ అవెలబుల్ స్కూల్ పేరెంట్స్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల అజయ్ మాట్లాడారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి వేల కోట్లు కేటాయిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు విద్యార్థుల చదువులకు రెండేళ్లుగా నిధులు కేటాయించకపోవడం రాజ్యాంగ హక్కులను హరించడమేనన్నారు. – కరీంనగర్