
పంచారామ యాత్ర, శబరిమలైకి ప్రత్యేక బస్సులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే కార్తికమాసం సందర్భంగా పంచారామ క్షేత్ర దర్శనం, అయ్యప్పస్వామి యాత్ర చేసే వారికి శబరిమలై ప్రత్యేక బస్సులు కాకినాడ డిపో నుంచి ఏర్పాటు చేస్తామని జిల్లా ప్రజారవాణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. పంచారామ స్పెషల్ అక్టోబర్ 25, 26 తేదీల్లో, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీల్లోను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాకినాడలో శనివారం రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట దర్శనం తర్వాత కాకినాడ చేరుకొంటుందన్నారు. శబరిమలై యాత్రవెళ్లే అయ్యప్పభక్తులు వారు కోరుకున్న చోట నుంచి కోరుకొన్న క్షేత్రాలను చూపించడానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ యాత్రకు వెళ్లే వారు 99592 25564 నంబర్‌లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మనోహర్, పీఆర్వో వెంకటరాజు పాల్గొన్నారు.