ముగిసిన పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పవిత్రోత్సవాలు

Oct 8 2025 6:55 AM | Updated on Oct 8 2025 6:55 AM

ముగిసిన పవిత్రోత్సవాలు

ముగిసిన పవిత్రోత్సవాలు

పెరవలి: ఆలయానికి వచ్చే అపవిత్ర భక్తులు, మంత్రోచ్ఛారణలో తప్పులు, ఆలయంలోకి వచ్చే క్రిమికీటకాల వలన జరిగే అపవిత్రతను పోగొట్టేందుకే ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. పెరవలి మండలం అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లకు హోమగుండం ఏర్పాటు చేసి అనంతరం వేదపండితులు పవిత్రాలకు పూజలు చేశారు. అనంతరం పవిత్రాలను, కలశాలను నెత్తిన పెట్టుకుని స్వామి వారికి సమర్పించారు. ఈ పవిత్రాల వల్ల ఆలయానికి, స్వామి వారికి భక్తులు, పండితుల వలన జరిగిన అపవిత్రత పోయి మళీకల జీవం వస్తుందని వర ప్రసాదాచార్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement