
ఒకరిపై కేసు నమోదు
భూపాలపల్లి అర్బన్: ఇంటికి వెళ్లి కర్రతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొర్లవీడు గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి ఇంటికి గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన బి లక్ష్మయ్య వెళ్లి ఇంట్లో నిద్రిస్తున్న రాజిరెడ్డిని బయటికి పిలిచారు. బయటికి రాగానే లక్ష్మయ్య చేతిలో ఉన్న కర్రతో రాజిరెడ్డిపై దాడి చేశాడు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
కాటారం: మండల కేంద్రానికి సమీపంలో సబ్ స్టేషన్‌పల్లిలో సెప్టెంబర్ 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాటారం సబ్‌స్టేషన్‌పల్లికి చెందిన మాచెర్ల మల్లేశ్(60) గత నెల 29న ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. గాయాలైపాలైన మల్లేశ్‌ను చికిత్స నిమిత్తం భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలవడంతో వైద్యులు రెఫర్ చేయగా వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.