
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం అనుబంధ దేవాలయాల్లోని శ్రీశుభా నందదేవి, శ్రీమహాసరస్వతీ అమ్మవార్లు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజుల పాటు వైభవంగా జరిగాయి. అమ్మవార్లు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం అమ్మవార్లు రాజరాజేశ్వరి అలంకరణలో దర్శనమిచ్చా రు. భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు.
శమీ పూజ..
విజయదశమి(దసరా) సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీరామాలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా గోదావరి నది వద్దకు మంగళవాయిద్యాలతో కాలినడక తీసుకెళ్లారు. ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ శమీ పూజ ఘనంగా నిర్వహించారు. అక్కడ శమీ(జమ్మిచెట్టు) ఆకులు తీసుకొని ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, అర్చకులు బైకుంఠపాండా, పవన్‌శర్మ, శ్రావణ్‌శర్మ, రామాచార్యులు, రిటైర్డు అర్చకులు లక్ష్మీనారాయణశర్మ, కృష్షమూర్తిశర్మ, భక్తులు పాల్గొన్నారు.

ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు