
జాతిపితకు ఘన నివాళి
భూపాలపల్లి అర్బన్: భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌లో జాతిపితకు ఘన నివాళులు అర్పించారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్‌శర్మ ముఖ్య అతిథిగా హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
ఎస్పీ కార్యాలయంలో కార్యక్రమానికి అదనపు ఎస్పీ నరేష్‌కుమార్ హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రత్నం, ఆర్‌ఎస్‌ఐ, డీపీఓ పాల్గొన్నారు.

జాతిపితకు ఘన నివాళి