
శ్రీ సరస్వతీదేవిగా అమ్మవార్లు దర్శనం
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీసరస్వతి, శ్రీఽశుభానందదేవి(పార్వతి) అమ్మవార్లు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు మూలనక్షత్రం సందర్భంగా శ్రీసరస్వతీదేవిగా భక్తులకు దర్శమిచ్చారు. సోమవారం ఆలయ అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో సరస్వతిమాత ఆలయంలో విశేష అభిషేక పూజలు చేశారు. అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. రాత్రి మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అనంతరం సరస్వతిమాత ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరస్వీకారాలు నిర్వహించి పలకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, మాజీ డైరెక్టర్ అశోక్, అర్చకులు రామాచార్యులు, శరత్‌చంద్రశర్మ, రామకృష్ణశర్మ, పవన్‌శర్మ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు.
నేడు అమ్మవారి వాహన సేవ..
శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు సింహావాహనంపై అమ్మవారి వాహన సేవ (ఊరేగింపు) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈఓ కోరారు.

శ్రీ సరస్వతీదేవిగా అమ్మవార్లు దర్శనం