
అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
భూపాలపల్లి: రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో రాష్ట్ర ఎన్ని కల అధికారి రాణి కుముదిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ ఐడీఓసీలో నోడల్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడానికే నోడల్ అధికారులను నియమించామన్నారు. గోడలపై రాజకీయ వ్రాతలు, ఫ్లెక్సీలు వంటివి తొలగించాలని, నియమావళి ఉల్లంఘన జరిగితే తగి న చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లు ప్రలోబాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, నోడల్ అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ