
డిప్యూటీ కలెక్టర్‌గా గండ్ర నవీన్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: డిప్యూటీ కలెక్టర్‌గా గండ్ర నవీన్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ రాహుల్‌శర్మను కలిసి జాయినింగ్ పత్రం సమర్పించి పూలబొకే అందజేశారు. విధుల్లో చేరిన నవీన్ రెడ్డిని కలెక్టర్ రాహుల్‌శర్మ అభినందించారు. ప్రజలకు సేవలందించే క్రమంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర కేడర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా నియామకం పొందడం అభినందనీయమని అన్నారు. విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని.. బాధ్యతలను సమర్థవంతంగా నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. ఉద్యోగ సాధనలో ప్రోత్సహించిన తల్లితండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా నాగవైష్ణవి
జిల్లా అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా గడ్డం నాగవైష్ణవి నియమితులయ్యారు. ఈ మేరకు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

డిప్యూటీ కలెక్టర్‌గా గండ్ర నవీన్‌రెడ్డి