
జీఎస్టీ తగ్గింపు పేదలకు వరం
● ఆదిలాబాద్ ఎంపీ నగేశ్
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు పేద, మధ్యతరగతి ప్రజలకు వరమని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం తీసుకున్న చర్యలను వివరిస్తూ పలువురికి తగ్గింపు ధరల కరపత్రాలను చూపుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గింపునకు తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 370 వస్తువులపై జీఎస్టీ తగ్గించిందని వివరించారు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర సరుకుల ధరలు తగ్గుముఖం పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజ్మీరా సీతారాంనాయక్, కృష్ణవేణి, రమేష్, వెంకట్, రాజానాయక్, సురేందర్, సిరికొండ బలరాం తదితరులు పాల్గొన్నారు.