
గ్రూప్–2కు పలువురి ఎంపిక
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్–2 ఎంపిక జాబితాలో పలువురు జిల్లా నుంచి ఎంపికయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి కాశీంపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్ సచివాలయంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా, సెగ్గంపల్లి గ్రామానికి చెందిన గజ్జె ప్రవళిక గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు. భూపాలపల్లి మండలం చికెన్ పల్లి గ్రామానికి చెందిన వాంకుడోతు సురేష్ ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. చిట్యాల మండలం బావుసింగ్‌పల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామారావు ఎంపీఓగా నియమితులయ్యారు.
కష్టపడి చదివి.. ఉద్యోగం సాధించి..
చిట్యాల: మండలంలోని బావుసింగ్‌పల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రమ–భీంరావు దంపతుల కుమారుడు రామారావు పదవ తరగతి ములుగులో, ఇంటర్ ఎస్‌ఆర్ హనుమకొండ, బీటెక్ హనుమకొండలో చదువుకున్నారు. ఆరేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్–2 కోసం కష్టపడి చదువుకున్నాడు. గతేడాది గ్రూప్–2 పోటీ పరీక్షలు రాశారు. ఆదివారం ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలలో మల్టీజోన్ –1లో ఎంపీఓగా ఉద్యోగం లభించింది. రామారావు గ్రూప్–2కు ఎంపికై ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
మొక్కవోని దీక్షతో..
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం చికెన్‌పల్లి గ్రామానికి చెందిన వాంకుడోతు సురేష్ చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగాడు. తన ఎనిమిదో ఏట తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి కమల అన్నీ తానై సురేష్‌ను చదివించింది. తినడానికి తిండి లేని రాత్రులు గడపడంతో పాటు తల్లితో కలిసి కూలీ పనులకు వెళ్లి సురేష్ విద్యాభ్యాసం చేశాడు. హనుమకొండలో ఇంటర్, బీటెక్ పూర్తిచేశాడు. 2020లో తల్లి కమల కేన్సర్‌తో మృతిచెందింది. సురేష్ తన స్నేహితుల సహాయంతో హైదరాబాద్‌లో గ్రూప్–1 కోచింగ్ తీసుకుని 2024లో గ్రూప్–1 పరీక్ష రాశాడు. 572 ర్యాంకు సాధించి ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.

గ్రూప్–2కు పలువురి ఎంపిక

గ్రూప్–2కు పలువురి ఎంపిక

గ్రూప్–2కు పలువురి ఎంపిక