సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కాళేశ్వరం: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీఽశుభానందదేవి (పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు ఏడో రోజు శ్రీ మహా చండీదేవిగా భక్తులకు దర్శమిచ్చారు. ఆదివారం ఆలయ అర్చకులు అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో రద్దీ నెలకొంది.
నేడు మూలనక్షత్రం..
శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా (నేడు) సోమవారం మూల నక్షత్రం సందర్భంగా శ్రీసరస్వతి, శ్రీశుభానందదేవి అమ్మవారు ఎనిమిదో రోజు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శ్రీసరస్వతి అమ్మవారు
శ్రీశుభానందదేవి అమ్మవారు
శ్రీమహా చండీదేవిగా అమ్మవార్ల దర్శనం