
స్థానిక రిజర్వేషన్లు ఖరారు
ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు..
సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు...
ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు..
భూపాలపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తూ మిగిలిన ఎస్సీ, ఎస్టీ, జనరల్, మహిళ స్థానాలకు గతంలో మాదిరిగానే కేటాయించారు.
జెడ్పీ చైర్మన్ బీసీ జనరల్‌కే..
రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు విడుదల చేయగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పీఠం బీసీ జనరల్‌కు కేటాయించారు. గత ఎన్నికల్లో ఎస్సీ మహిళకు కేటాయించగా బీసీలకు రిజర్వేషన్లు పెంచిన దృష్ట్యా ఈసారి బీసీ జనరల్‌కు దక్కింది. దీంతో ఈ దఫా ఎన్నికల్లో చైర్మన్ పీఠానికి పోటీ ఎక్కువగా నెలకొనే అవకాశం ఉంది. రిజర్వేషన్ విషయం తెలుసుకున్న పలువురు బీసీల్లోని ప్రముఖులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుంటున్నారు.
అర్ధరాత్రి రిజర్వేషన్ల వెల్లడి..
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను శనివారం వెల్లడించాలని రాష్ట్రస్థాయి అధికారులు ముందస్తుగానే సూచించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్ల ప్రక్రియను శుక్రవారమే పూర్తి చేసుకున్న అధికారులు అధికారికంగా శనివారం మధ్యాహ్నం వరకే వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం అధికారులు శనివారం మధ్యాహ్నం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. అయినప్పటికీ అర్ధరాత్రి వరకు రిజర్వేషన్ల వివరాలను అధికారికంగా వెల్లడించలేకపోయారు.
మండలం ఎంపీపీ జెడ్పీటీసీ
పలిమెల ఎస్సీ ఎస్సీ
మహదేవపూర్ బీసీ బీసీ
మహాముత్తారం ఎస్టీ ఎస్టీ
కాటారం జనరల్(మహిళ) జనరల్
మల్హర్ ఎస్సీ(మహిళ) ఎస్సీ
భూపాలపల్లి బీసీ బీసీ
గణపురం బీసీ బీసీ(మహిళ)
కొత్తపల్లిగోరి బీసీ(మహిళ) బీసీ(మహిళ)
రేగొండ జనరల్ జనరల్
చిట్యాల బీసీ బీసీ
మొగుళ్లపల్లి జనరల్ జనరల్(మహిళ)
టేకుమట్ల ఎస్సీ ఎస్సీ(మహిళ)
మండలం జీపీలు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్
భూపాలపల్లి 26 4 5 10 7
చిట్యాల 26 5 3 10 8
గణపురం 17 3 1 7 6
కాటారం 24 8 2 10 4
కొత్తపల్లిగోరి 16 3 1 6 6
మహదేవపూర్ 18 4 2 8 4
మల్హర్ 15 3 2 6 4
మొగుళ్లపల్లి 26 6 0 11 9
మహాముత్తారం 24 4 8 6 6
పలిమెల 8 1 3 2 2
రేగొండ 23 4 1 10 8
టేకుమట్ల 25 6 0 11 8
మొత్తం 248 51 28 97 72
జిల్లాలో 12 ఎంపీపీ, 12 జెడ్పీటీసీ..
109 ఎంపీటీసీ, 248 సర్పంచ్,
2,102 వార్డు స్థానాలు
జెడ్పీ చైర్మన్ బీసీ జనరల్‌కు కేటాయింపు
అర్ధరాత్రి వెల్లడించిన అధికారులు
మండలం ఎంపీటీసీ ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్
స్థానాలు
భూపాలపల్లి 11 2 2 5 2
చిట్యాల 12 2 1 5 4
గణపురం 10 2 1 4 3
కాటారం 11 4 1 5 1
కొత్తపల్లిగోరి 6 1 0 3 2
మహదేవపూర్ 9 2 1 4 2
మల్హర్ 7 2 1 3 1
మొగుళ్లపల్లి 10 2 0 4 4
మహాముత్తారం 8 1 3 2 2
పలిమెల 5 0 2 1 2
రేగొండ 11 2 0 5 4
టేకుమట్ల 9 2 0 4 3