
పండుగ సందడి..
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పట్టణం రెండు మూడు రోజుల నుంచి రద్దీగా మారిపోయింది. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందడి మొదలైంది. పండుగకు కావాల్సిన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసేందుకు పట్టణవాసులు, సమీప గ్రామాల ప్రజలు దుకాణాలకు రావడంతో భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన రహదారి శనివారం కిక్కిరిసిపోయింది. పిల్లలు హాస్టల్, కళాశాలల నుంచి సొంతూళ్లకు చేరుకోవడంతో పట్టణంతో పాటు గ్రామాల్లో పండుగ వాతావరణ నెలకొంది.
దుకాణాలు కిటకిట..
పండుగ సందర్భంగా పిల్లలు, పెద్దలకు నూతన దు స్తులు, మహిళలు, బాలికల ఇతర వస్తువులు, ఆభరణాల కోసం కంగన్‌హాల్, బంగారం, బట్టల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. నూతన వైరెటీలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి కుంటుంబ సమేతంగా దుకాణాలకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
పెరిగిన ధరలు
గతేడాది దసరా పండుగతో పోల్చుకుంటే ఈ ఏడాది సూమారు 10 నుంచి 20 శాతం ధరలు ప్రతి వస్తువుపైన పెరిగాయి. పెరిగిన ధరలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. పండుగ నేపథ్యంలో తప్పదు కాబట్టి ధరలు పెరిగినప్పటికీ కొనుగోలు చేయక తప్పడం లేదంటున్నారు.
రద్దీగా ఆర్టీసీ బస్సులు
హనుమకొండ, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివాసిస్తున్న జిల్లావాసులు దసరా పండుగకు ఇంటికి చేరుకుంటున్న సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కవ మంది ప్రయాణించడం ద్వారా బస్సులు, బస్టాండ్‌లు జనాలతో రద్దీగా మారిపోయాయి. విద్యాసంస్థలకు వారం రోజుల క్రితం సెలవులు ఇవ్వడంతో అప్పటి నుంచి విద్యార్థులు, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు కొందరు బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు.
భారీగా మేకల దిగుమతి
దసరా పండుగ రోజు మాంసం విక్రయాలు చేసేందుకు పట్టణంలో ముందస్తుగా వ్యాపారులు భారీగా మేకలను దిగుమతులు చేశారు. కొత్తగా మాంసం దుకాణాలు వెలిశాయి. ముగ్గురు నలుగురు కలిసి సొంతంగా ఒక్కో మేకను కొనుగోలు చేసుకుంటున్నారు. మేకల ధరలు కూడా పెరిగిపోయాయి.
గాజులు కొనుగోలు చేస్తున్న మహిళలు
భూపాలపల్లి పట్టణంలో దుస్తుల కొనుగోలు
సొంతూళ్లకు చేరిన పిల్లలు
కొనుగోళ్లతో బట్టల షాపుల్లో కిటకిట
దసరా కోసం భారీగా మేకల దిగుమతి
సందడిగా మారిన
భూపాలపల్లి పట్టణం
అధిక ధరలతో బెంబేలెత్తుతున్న జనాలు

పండుగ సందడి..