
ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి
కాటారం: గ్రామీణ ప్రాంతంలోని యువతకు సాంకేతిక రంగాల్లో శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు కృషి చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం మండలకేంద్రంలో ఐటీఐ అనుసంధానంగా ఏర్పా టు చేసిన ఏటీసీ కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబుతో కలిసి తిరుమల శని వారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య రంగాల్లో శిక్షణ కల్పించి తక్కువ సమయంలో ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్‌బాబు ముందుకెళ్తున్నారని తెలిపారు. మంథని నియోజకవర్గంలో ఉన్నత విద్యాసంస్థలు, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఏటీసీ లాంటి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు ఘనత మంత్రి శ్రీధర్‌బాబుకే దక్కుతుందన్నారు. యువకులు ఏటీసీ ద్వారా అందుతున్న కోర్సులను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భిక్షపతి, మహదేవపూర్ పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, ట్రాన్స్‌కో ఏఈ ఉపేందర్, మాజీ ఎంపీటీసీ జాడి మహేశ్వరి, ఆంగోతు సుగుణ, నాయకులు చీమల రాజు, ఐటీఐ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్
పంతకాని తిరుమల