
సాంకేతిక కేంద్రాలతో ఉపాధి అవకాశాలు
భూపాలపల్లి అర్బన్: యువతకు నైపుణ్యంతో పాటు నాణ్యతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేశామని, దీంతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో రూ.43 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏటీసీ కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. యువత ఉపాధి అవకాశాల కల్పనకు ఆధునిక సాంకేతికతతో కూడిన పరిజ్ఞానం చాలా అవసరమన్నారు. ఏటీసీ కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకు పరిశ్రమలతో పాటు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అ వసరం ఉందని స్పష్టంచేశారు. ఏటీసీ కేంద్రానికి రూ.43 కోట్లు మంజూరు చేయడం పట్ల ముఖ్య మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో భూపాలపల్లి, కాటారంలో ఐటిసి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్ జామ్లనాయక్, కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ రాజేంద్రప్రసాద్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీర స్వామి, ఉపాధి కల్పన అధికారి శ్యా మల, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ మల్చూర్‌నాయక్, ము న్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసులు, పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు