
ప్రధాన రహదారిపై మొరాయించిన లారీ
కాటారం: కాటారం మండలం ధన్వాడ సమీపంలో ప్రధాన రహదారిపై శనివారం లారీ మొరాయించింది. కాటారం నుంచి తాడిచర్ల వైపుగా బొగ్గు లోడ్ కోసం వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఇంజిన్ ఫెయిల్ అయి రోడ్డుపై నిలిచిపోయింది. రహదారి నిర్మాణంలో ఉండటంతో పాటు ఇరుకుగా ఉన్న కల్వర్టు వద్ద లారీ నిలిచిపోవడంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. భూపాలపల్లి నుంచి మంథని వైపుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు, పలు వాహనాలు మండలంలోని బస్వాపూర్ మీదుగా కొయ్యూర్ గుండా రాకపోకలు సాగించాయి. పోలీసులు లారీని జేసీబీ సహాయంతో తొలిగించి రాకపోకలను పునరుద్ధరించారు.