
సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక తీజ్
భూపాలపల్లి రూరల్: సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగని, ఈ వేడుకలు సామాజిక ఐక్యతను, సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం భూపాలపల్లి మండలం రూరల్, అర్బన్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కమలపూర్‌తో పాటు, గొల్లబు ద్దారం, దూదేకులపల్లి, అర్బన్‌లో కుందురుపల్లి, బానోత్‌వీధిలో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. లంబాడీల సంస్కృతిసంప్రదాయాలకు ప్రతీక తీజ్ అన్నారు. లంబాడీ కులస్తుల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అనంతరం యువతులతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల లంబాడాలు కుల పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు