
మేడారానికి జాతీయ హోదా కల్పిస్తాం
ములుగు: మేడారం మహా జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే కేంద్రం జాతీయ హోదా కల్పించేలా తన వంతు కృషి చేస్తానని మహబుబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ తెలిపారు. ములు గు రామాలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత అన్నదాన కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే తను ఎంపీగా ఉండి ఆరు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని వెల్ల డించారు. గిరిజన యూనివర్సిటీ కోసం నిరాహార దీక్ష చేశానని తెలి పారు. ఇప్పుడు మేడారం జాతీయ హోదా కోసం కృషి చేస్తానన్నారు. రానున్న జాతర వరకు జాతీయ హోదా కల్పించేలా చర్యలు చేపడతానని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ స భ్యుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్