
ఏసీబీ వలలో సైట్ ఇంజనీర్
ఈ నెల 30లోపే..
తెలంగాణ రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల సంస్థ జనగామ సబ్ డివిజన్ సైట్ ఇంజనీర్ సామల రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
జిల్లాలో అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలతో పాటు రిటర్నింగ్ అధికారులను కూడా సిద్ధం చేశారు. మండలాలకు నమూనా బ్యాలెట్ పేపర్లు చేరాయి. దీంతో పల్లెల్లో ఎన్నికల జోష్‌తో వేడెక్కుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈనెల 30లోపే షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉండడంతో రిజర్వేషన్లపై ఆశావహులు టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియామక పదవులు దక్కకుండానే రెండేళ్లు గడిచిపోయింది. ఈక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వస్తే పదవులు దక్కుతాయని ఆశతో పోటీలో ఉంటున్నట్లు ప్రకటిస్తున్నారు. తమ కుల సంఘాలను ఒకటిగా చేసుకుంటున్నారు. ఇరుగు, పొరుగును దగ్గర చేసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వార్డుల వారీగా నిత్యం ప్రజల్లో ఉంటూ కసరత్తు ప్రారంభించారు. రిజర్వేషన్లు ఎలా ఉండబో తున్నాయనే ఉత్కంఠ మాత్రం జిల్లావ్యాప్తంగా మొదలైంది. పాన్ డబ్బాలు, టీస్టాల్స్, హోటళ్లు, దాబాల్లో నలుగురు కలిస్తే చాలు సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలపైనే చర్చ సాగుతోంది. రేసులో ఉండే ఆశావహులు ఇప్పటికే దావత్‌లు, పార్టీలు కూడా మొదలుపెట్టారు. ఒక్కో సర్పంచ్‌కు రేసులో పదిమంది వరకు పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. యూత్ ఎక్కువగా రాజకీయాలవైపు ఫోకస్ చేస్తున్నారు. రిజర్వేషన్ అనుకూలిస్తే సర్పంచ్ లేదా ఎంపీటీసీకి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఏసీబీ వలలో సైట్ ఇంజనీర్