
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు నిఖిల్‌రాజ్
కాటారం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల హ్యాండ్‌బాల్ అకాడమి విద్యార్థి నిఖిల్‌రాజ్ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. గత నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ మినీ సెలక్షన్స్ ట్రైల్స్‌లో నిఖిల్‌రాజ్ ప్రతిభ కనబర్చారు. దీంతో నిర్వహకులు 17వ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ అకాడమి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, కార్యదర్శి లక్ష్మణ్, టీం కోచ్ వెంకటేశ్ వెల్లడించారు. రేపటి నుంచి 29వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో నికిల్‌రాజ్ తెలంగాణ జట్టు తరఫున ఆడనున్నారు. అకాడమి విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికావడం పట్ల ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీడీ వెంకటేశ్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, వార్డెన్ బలరాం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు.