
బతుకమ్మ సంబురాలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయం ఆవరణలో తెలంగాణ టూరిజం, కల్చరల్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉండగా పర్యటన రద్దు అయింది. దీంతో రాత్రి 7గంటలకు అడిషనల్ కలెక్టక్ విజయలక్ష్మి, డిడబ్ల్యూఓ మల్లీశ్వరీ, డీవైఎస్‌ఏ రఘులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్షం కారణంగా ప్రధాన ఆలయం అనివెట్టి మండపం వద్ద అడిషనల్ కలెక్టర్‌తో కలిసి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, మహిళలు, అధికారులు బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఆడారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, ఎంపీడీఓ రవీంద్రనాధ్, హరితహోటల్ మేనేజర్ జక్కం సురేష్, సీడీపీఓ రాధిక, ఎంపీఓ ప్రసాద్, కార్యదర్శి సత్యనారాయణ, తదితరలు పాల్గొన్నారు.