భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు 34 శాతం లాభాల వాటా ప్రకటించడం పట్ల్ల ఐఎన్‌టీయూసీ నాయకులు మంగళవారం జిల్లాకేంద్రంలో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఐన్‌టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 34శాతం వాటా ప్రకటించడం సంతోషకరమైన విషయమన్నారు. లాభాల వాటా పెంచేందుకు కృషిచేసిన సింగరేణి ఏరియాల మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, బుచ్చయ్య, రఘుపతిరెడ్డి, సమ్మిరెడ్డి, అశోక్, రమేష్, రవి, కృష్ణ, సమ్మయ్య పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి మంగళవారం దర్శించుకున్నా రు. ప్రతి ఒక్కరినీ తల్ల్లి చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చదువు అన్నారెడ్డి, రమేష్, కుమార్, రామస్వామి, సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాటారం: సూర్యాపేట జిల్లా దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో అన్యాయానికి గురవుతున్న వలస కార్మికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని యూవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపుయాదవ్, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోకన్వీనర్ అయితే బాపు, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఫ్యాక్టరీపై ఉంటుందని అన్నారు. అన్యాయానికి గురవుతున్న వలస కార్మికులకు తోడుగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు, సంఘాలు ఫ్యాక్టరీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు కాలినేని రాజమణి, పొలం ప్రసాద్ పాల్గొన్నారు.
కాటారం: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ హెచ్చరించారు. కాటారం మండలకేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను మంగళవారం జిల్లా వైద్యాధికారి తనిఖీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణ, అనుమతి పత్రాలు, సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్యాన్ని పరిశీలించారు. సరైన అనుమతి పత్రాలు లేని పలు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశారు. వైద్య పరీక్షలకు సంబంధించిన ధరల పట్టికను ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని, అర్హులైన వైద్యులతో మాత్రమే వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా వైద్య పరీక్షల పేరిట గ్రామీణ ప్రజల వద్ద అడ్డగోలుగా బిల్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయవద్దని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సందీప్, మండల వైద్యాధికారి డాక్టర్ మౌనిక ఉన్నారు.
ఆయుర్వేద వైద్య శిబిరం
గణపురం:మైలారం గ్రామంలో ఆయుర్వేద ఉచిత వైద్యశిబిరాన్ని డీఎంహెచ్‌ఓ మధుసూదన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ జీవితంతో ఆయుర్వేద వైద్యం ముడిపడి ఉందన్నారు. వైద్య శిబిరంలో 425 మందికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తనూజ రాణి, సారంగపాణి, జగదీష్ కన్నా, గీత పాల్గొన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం
సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం
సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం