
కోలిండియాలో సింగరేణి సత్తా చాటాలి
భూపాలపల్లి అర్బన్: త్వరలో జరగనున్న కోలిండియా క్రీడాపోటీలలో సింగరేణి క్రీడాకారులు సత్తాచాటి ముందు వరుసలో నిలబెట్టాలని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సింగరేణి కంపెనీ స్థాయి బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు మంగళవారం భూపాలపల్లిలో ప్రారంభమయ్యాయి. ఏరియాలోని కృష్ణకాలనీ మినీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి రాజేశ్వర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. క్రీడలు అందరిలో మానసికోల్లాసం, సానుకూలతను నింపుతాయన్నారు. మంచి ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్ వర్క్‌ను వికసింపజేస్తాయని చెప్పారు. నేటి ఆధునిక జీవన విధానంలో వర్క్ లైఫ్ బ్యా లెన్స్ కోసం క్రీడల పాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. మహిళా ఉద్యోగులు క్రీడల్లో రాణించాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాల్లో గణనీయంగా మహిళా ఆఫీసర్లు నియమితులయ్యారన్నారు. ఈ అవకాశాలతో మహిళలు సింగరేణిలో అన్ని రంగాల్లో, ము ఖ్యంగా క్రీడలలో స్ఫూర్తిగా ముందుకు రావాలన్నా రు. మహిళల పాత్రను మరింత ప్రోత్సహిస్తూ, మహిళా ఉద్యోగులు క్రీడల్లో విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఐఏ భూపాలపల్లి ఏరియా అధ్యక్షుడు ఎండీ నజీర్, గుర్తింపు, ప్రా తినిథ్య సంఘం నాయకులు మోటపలుకుల రమేష్, బెతెల్లి మధుకర్‌రెడ్డి, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రా వణ్‌కుమార్, న్యాయ నిర్ణేతలు ఏసప్ప, మహమ్మద్ ఇంతియాజ్, మల్లేష్‌యాదవ్, హనుమంత్‌రాజ్, జా న్‌వెస్లీ, అశోక్, నరేందర్‌రెడ్డి, రమేష్, పర్స శ్రీని వాస్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ దేవయ్య పాల్గొన్నారు.
ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి
కంపెనీ స్థాయి బాడీబిల్డింగ్,
వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం

కోలిండియాలో సింగరేణి సత్తా చాటాలి