
ఓపెన్‌కాస్ట్ సందర్శన
మల్హర్: మండలంలోని తాడిచర్ల బ్లాక్–1 ఓపెన్‌కాస్ట్‌ను జెన్‌కో ఐఆర్‌టీసీ, డైరెక్టర్ (కోల్ అండ్ లాజిస్టిక్) నాగ్య సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నాగ్య ఓపెన్‌కాస్ట్ వ్యూ పాయింట్ నుంచి ఓసీపీలో జరుగుతున్న పని తీరు, బొగ్గు ఉత్పత్తి వివరాలను ఏఎమ్మార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓపెన్‌కాస్ట్ ప్లాన్లు, పర్యావరణం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలను నాగ్యకు ఏఎమ్మార్ అధికారులు వివరించారు. ఓపెన్‌కాస్ట్‌లో జరుగుతున్న పనులు, మైన్‌లో అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి అభినందించారు. అనంతరం నాగ్య మాట్లాడుతూ.. అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేసి నిర్ధేశించిన బొగ్గు లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్మార్ సీఈఓ డీఎల్‌ఆర్ ప్రసాద్, కేటీపీ ఓవైఎం సీఈ శ్రీప్రకాశ్, ఎస్‌ఈ రామకృష్ణ, ముత్యంరావ్, జెన్‌కో జనరల్ మేనేజర్ మోహన్‌రావు, తాడిచర్ల ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్టి, సీనియర్ జనరల్ మేనేజర్ కేఎస్‌ఎన్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.