
కల్చరల్ పోటీలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్‌పీపుల్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏరియా స్థాయి కల్చరల్ పోటీలను ప్రారంభించారు. ఏరియాలోని సీఈఆర్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ మారుతి హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్, డాన్స్, ఇతర వైవిద్యమైన కార్యక్రమాల్లో ప్రతిభను ప్రదర్శించారు. సింగరేణి సంస్థ సాంస్కృతిక సంపదను సమృద్ధి చేస్తూ ఉద్యోగుల ఆనంద, సామాజిక ఐక్యతను పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. కోలిండియా స్థాయిలో రాణించే విధంగా ప్రదర్శనలు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, కోఆర్డినేటర్ పాక దేవయ్య, కల్చరల్ కోఆర్డినేటర్ అడిచర్ల శ్రీనివాస్, కళాకారులు పాల్గొన్నారు.