
నేటి నుంచి ఓపెన్ సప్లిమెంటరీ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: నేటినుంచి (సోమవారం) ఓపెన్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలకు విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.
కాళేశ్వరం: పితృపక్షాలను పురస్కరించుకొని అమావాస్య సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవస్థాన ఆవరణలో మహదేవపూర్ గ్రామానికి చెందిన నూక సత్యనారాయణ, ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం నర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు హాజరై భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, కాళేశ్వరం మాజీ ఎంపీటీసీ రేవెల్లి మమత, దేవస్థానం మాజీ డైరెక్టర్‌లు గందెసి సత్యనారాయణ, మెంగాని అశోక్, సీనియర్ నాయకులు గందెసిరి మధుసూదన్ పాల్గొన్నారు.
జీఓ నంబర్ 64ను రద్దు చేయాలి
భూపాలపల్లి అర్బన్: జీఓనంబర్ 64ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదురుగా ఆశ్రమ పాఠశాలల కాంటిజెన్సీ వర్కర్స్ చేపడుతున్న దీక్షలు ఆదివారం నాటికి 10వ రోజుకు చేరుకోగా బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. వారి దీక్షలకు సాయిలు సంఘీభావం తెలిపి మాట్లాడారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరారు. జీఓ వలన వేతనాలు తగ్గుతున్నాయన్నారు. నూతన జీఓను సవరించి పాత జీఓ 212ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు జావీద్, వెంకటలక్ష్మి, కిషన్, రామ్‌సింగ్, కంటిభాయ్, స్వరూప, విజయ, ఎర్రక్క పాల్గొన్నారు.
నిరుపేదలకు
సీఎం రిలీఫ్ ఫండ్ వరం
మొగుళ్లపల్లి : ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు 69 మందికి రూ.16.50లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
చిట్యాల: మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన జాలిగపు కొంరయ్య, మండలకేంద్రంలో పెరుమాండ్ల కృష్ణగౌడ్, అందుకుతండాలో దాసారపు రాజయ్య(డీలర్), నైన్‌పాకలో వావిళ్ల రాములు, మండ రాజక్క, బిక్కనూరి లచ్చక్క ఇటీవల మృతిచెందారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు బుర్ర లక్ష్మన్, గుర్రపు తిరుపతిగౌడ్, చిలుకల రాయకోంరు, దొడ్డి కిష్టయ్య ఉన్నారు.

నేటి నుంచి ఓపెన్ సప్లిమెంటరీ పరీక్షలు

నేటి నుంచి ఓపెన్ సప్లిమెంటరీ పరీక్షలు