
పూల పండుగ షురూ..
– మరిన్ని ఫొటోలు 11లోu
‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఆటా పాటలతో ఆడపడుచుల పండుగ బతుకమ్మ ఆదివారం ప్రారంభమైంది. జిల్లాలో ఉదయం నుంచే పూల సేకరణలో నిమగ్నమైన మహిళలు సాయంత్రానికి తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చారు. కుటుంబీకులు, బంధువులు, స్నేహితులతో కలిసి సమీప ఆలయాలు, కూడళ్లలో బతుకమ్మలను ఒక చోట చేర్చారు. చప్పట్లతో చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. బతుకమ్మ పాటలతో వీధులు మారుమోగాయి. ఆడపడుచులకు అతిపెద్ద పండుగైన బతుకమ్మ ఎంగిలిపూలతో ప్రారంభమైంది. జిల్లాకేంద్రంలో బతుకమ్మ ఆడుకునేందుకు మున్సిపాలిటీ, గ్రామాలలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆట స్థలాలు చదునుచేసి విద్యుత్ సౌకర్యం కల్పించారు.
– భూపాలపల్లి అర్బన్