
నేటినుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
కాళేశ్వరం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాల్లో నేటి(సోమవారం) నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈసారి తిథులు కలిసి ఒకే రోజు రావడంతో ఒక రోజు పెరిగి పదకొండు రోజుల పాటు వివిధ అలంకరణల్లో భక్తులకు శ్రీశుభానందదేవి(పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు వివిధ అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారు.
వివిధ అలంకరణలు..
22న బాలత్రిపురా సుందరి దేవి , 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణదేవి, 25న కాత్యాయనిదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలితాదేవి, 28న మహాచండీ దేవి, 29న మూలనక్షత్రం సందర్భంగా శ్రీసరస్వతిదేవి, 30న దుర్గాదేవి (దుర్గాష్టమి), అక్టోబర్ 1న మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి) అదే రోజున మధ్యాహ్నం బలిహరణం, పూర్ణాహుతి యాగశాలలో హోమం కార్యక్రమం నిర్వహిస్తారు. 2న రాజరాజేశ్వరీదేవి అలంకరణల్లో భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తారు. దీంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. విజయ దశమి (దసరా) సందర్భంగా సాయంత్రం శ్రీరామాలయం నుంచి గోదావరికి మంగళవాయిద్యాలతో బయలుదేరి 4.30గంటలకు శమీ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం ప్రసాద వితరణ చేస్తారు. ఉత్సవాలకు 11 రోజులు ప్రత్యేకంగా ప్రతి రోజు వరంగల్‌కు చెందిన వారితో డెకరేషన్స్ పూలతో అలంకరిస్తారు. ఇప్పటికే ఆలయాలు విద్యుత్ బల్బులతో అలంకరిస్తున్నారు.
ముస్తాబైన అమ్మవార్ల ఆలయాలు
నేడు బాల త్రిపురా సుందరిదేవి
అలంకరణ