
మునిగిన పంట పొలాలు
మల్హర్: మానేరు బ్యాక్ వాటర్ కారణంగా మల్హర్ మండలంలోని వల్లెకుంట మానేరు శివారులోని పంట పొలాలు నీట మునిగాయి. కొన్ని రోజులు కురిస్తున్న వర్షాలతో ప్రవాహం పెరిగింది. ఇటీవల కరీంనగర్ డ్యాం గేట్లు ఎత్తడంతో తాడిచర్ల– ఖమ్మంపల్లి మానేరులో వరద ప్రవావం పెరిగింది. దీంతో అడవి సోమన్‌పల్లి, వల్లెకుంట వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్ వద్ద వరద పెరగడంతో వల్లెకుంట శివారులోని 15 ఎకరాల మేరకు పంట పొలాలు నీట మునిగాయి. పొలాలు మునగడంతో తమ పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.